Bandi Sanjay: ట్యాంక్ బండ్ పై సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం: బండి సంజయ్

We will put Super Star Krishna statue on Tank Bund says Bandi Sanjay
  • సినీ రంగానికి కృష్ణ చేసిన సేవలు చాలా గొప్పవన్న బండి సంజయ్
  • కృష్ణ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని వ్యాఖ్య
  • దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు కృష్ణ పేరును సిఫారసు చేస్తామని వెల్లడి 
సూపర్ స్టార్ కృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. మరోవైపు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, సినీ రంగానికి కృష్ణ చేసిన సేవలు చాలా గొప్పవని, ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. తెలుగు సినిమాకు హంగులు దిద్దిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ అని అన్నారు. 

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతేకాదు, కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చే విషయమై కూడా బీజేపీ తరపున కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని తెలపారు. 

మరోవైపు, కాసేపట్లో కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి.
Bandi Sanjay
BJP
Krishna
Statue
Tollywood

More Telugu News