smallest: విడుదలైన బుల్లి ఎలక్ట్రిక్ కారు 'ఈజ్- ఇ'

  • ఎక్స్ షోరూమ్ ధర రూ.4.79 లక్షలు
  • మొదటి 10 వేల బుకింగ్ ల వరకే ఈ ధర
  • ఇప్పటికే 6,000 బుకింగ్ లు
  • ముగ్గురు కూర్చుని ప్రయాణించే వీలు
Indias smallest most affordable EV car EaS E launched

దేశ మార్కెట్లో అతి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి వచ్చింది. దీని పేరు ఈఏఎస్-ఇ (ఈజ్-ఇ). పుణెకు చెందిన పీఎంవీ ఎలక్ట్రిక్ కంపెనీ ఈ కారును బుధవారం విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.4.79 లక్షలుగా ఉంది. దీనికి స్థానిక రవాణా పన్నులు, బీమా చార్జీలు, యాక్సెసరీల చార్జీ అదనం. మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో తక్కువ రేటు వాహనం ఇదే. 

అయితే రూ.4.79 లక్షల ధర మొదటగా బుక్ చేసుకునే 10 వేల యూనిట్లకే వర్తిస్తుందని పీఎంవీ ఎలక్ట్రిక్ తెలిపింది. అధికారికంగా విడుదల చేయడానికి ముందే 6,000 యూనిట్లకు బుకింగ్ లు వచ్చాయి. పీఎంవీ వెబ్ సైట్ కు వెళ్లి రూ.2,000 చెల్లించి కారు కోసం బుక్ చేసుకోవచ్చు. 

ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారి కూర్చుని ఈ కారులో ప్రయాణించొచ్చు. పట్టణాల్లో ప్రయాణానికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. 9.56 అడుగుల పొడవు, 3.79 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఎత్తు 5.24 అడుగులు. కారు బరువు 550 కిలోలు. 

ఆన్ బోర్డ్ నేవిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ తదతర ఆధునిక ఫీచర్లు చాలానే ఉన్నాయి. ఒక్క సారి చార్జ్ తో 120- 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించే విధంగా బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. నాలుగు గంటల్లో చార్జింగ్ పూర్తి అవుతుంది. 15 యాంప్స్ సాకెట్ నుంచే చార్జ్ చేసుకోవచ్చు.

More Telugu News