Bollywood: ఆ కారణం వల్లనే జయా బచ్చన్​ను పెళ్లి చేసుకున్నానంటున్న అమితాబ్ బచ్చన్

Big B reveals he married Jaya Bachchan because she had long hair
  • జయా బచ్చన్ పొడవాటి జట్టు చూసే వివాహం చేసుకున్నట్టు వెల్లడి
  • కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో చెప్పిన బిగ్ బి
  • ఆ కంటెస్టెంట్ తో సరదా సంభాషణ
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన వైవాహిక జీవితం గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కౌన్ బనేగా కరోడ్‌పతి 14వ సీజన్ లో భాగంగా రాజస్థాన్‌  జైపూర్‌కు చెందిన కాస్మోటాలజిస్ట్ ప్రియాంక మహర్షి తో బిగ్ బి సరదాగా సంభాషించారు. ఈ ఎపిసోడ్ సమయంలో అమితాబ్ బచ్చన్ ప్రియాంక జుట్టును అభినందించారు. ఒక్కసారి చూపించమని కూడా అభ్యర్థించాడు. ఈ షోకి వచ్చే ముందు తన పొడవాటి వెంట్రుకలను కత్తిరించుకున్నానని ప్రియాంక ఆయనకు చెప్పింది. అంతకుముందు గత నాలుగేళ్లలో ఒక్కసారి కూడా జట్టును తాకలేదని చెప్పింది.

దీనికి, అమితాబ్ బచ్చన్ తన భార్య జయా బచ్చన్‌కు పొడవాటి జుట్టు ఉన్నందునే ఆమెను వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు. ‘నేను నా భార్యను పెళ్లి చేసుకోవడానికి ఒక కారణం ఆమెకు పొడవాటి జట్టు ఉండటమే’ అని బాలీవుడ్ సూపర్ స్టార్ అన్నారు. అలాగే, దివంగత లతా మంగేష్కర్ పొడవాటి జుట్టు గురించి మాట్లాడి, ఆమెను ప్రశంసించారు.
Bollywood
Amitabh Bachchan
jaya bachchan
marriage
kbc

More Telugu News