Population: నేటితో 800 కోట్లకు చేరిన ప్రపంచ జనాభా

World population reaches 8 billion mark
  • ప్రపంచ జనాభాపై ఐరాస జనాభా నిధి సంస్థ నివేదిక
  • 11 ఏళ్లలో 100 కోట్లు పెరిగిన ప్రపంచ జనాభా
  • 2011లో 700 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా
  • 1974లో ప్రపంచ జనాభా 400 కోట్లు
  • 48 ఏళ్లలో రెట్టింపైన వైనం
ప్రపంచ జనాభా నేటితో 800 కోట్లకు చేరింది. 2011 అక్టోబరులో ప్రపంచ జనాభా 7 బిలియన్లు కాగా, 2022 నవంబరు 15తో అది 8 బిలియన్లకు పెరిగింది. కేవలం 11 ఏళ్లలోనే భూమండలంపై 100 కోట్ల జనాభా పెరిగినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. 1974లో 400 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా ఈ 48 సంవత్సరాల్లో రెట్టింపైంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి జనాభా నిధి సంస్థ వెల్లడించింది. 

కాగా, ప్రపంచంలో చైనా, భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశాలు అని తెలిసిందే. ప్రపంచ జనాభాలో 36 శాతం ఈ రెండు దేశాల్లోనే ఉంది. అయితే, 2023 నాటికి జనాభా విషయంలో భారత్... చైనాను అధిగమిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ప్రస్తుతం చైనా జనాభా 144 కోట్లు కాగా, భారత్ జనాభా 138 కోట్లు.
Population
World
UN
India
China

More Telugu News