Pawan Kalyan: కృష్ణ పార్ధివదేహానికి పవన్ కల్యాణ్ నివాళి... వీడియో ఇదిగో!

Pawan Kalyan paid last respect to Krishna mortal remains
  • తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కృష్ణ
  • చికిత్స పొందుతూ ఈ వేకువజామున కన్నుమూత
  • ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం
  • కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన పవన్
సూపర్ స్టార్ కృష్ణ ఈ వేకువజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు అత్యుత్తమ స్థాయి వైద్యం అందించినప్పటికీ ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. కృష్ణ భౌతికకాయాన్ని ఆసుపత్రి నుంచి నానక్ రామ్ గూడలోని నివాసానికి తరలించారు. ఈ నేపథ్యంలో, కృష్ణ పార్థివదేహానికి పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. కృష్ణ మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

పవన్ వచ్చిన సమయంలో మహేశ్ బాబు కూడా అక్కడే ఉన్నారు. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న మహేశ్ తీవ్ర నిస్తేజంతో కనిపించారు. అటు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
Pawan Kalyan
Superstar Krishna
Homage
Last Respect
Mahesh Babu

More Telugu News