Air India: ఎయిర్ ఇండియాకు షాక్ ఇచ్చిన యూఎస్ రవాణా విభాగం

US directs six airlines including Air India to pay 622 million dollars in passenger refunds
  • ప్రయాణికులకు చార్జీలను తిరిగి చెల్లించాలని ఆదేశం
  • రూ.972 కోట్లను చెల్లించనున్న ఎయిర్ ఇండియా
  • ఆరు ఎయిర్ లైన్స్ సంస్థలకు ఇదే మాదిరి ఆదేశాలు
అమెరికా ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్.. ఎయిర్ ఇండియా సహా పలు విమానయాన సంస్థలకు (ఎయిర్ లైన్స్ కంపెనీలు) షాక్ ఇచ్చింది. వాటికి జరిమానాలు విధిస్తూ, టికెట్లు రద్దు చేసుకున్న ప్రయాణికులకు చార్జీలను తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా మొత్తం ఆరు ఎయిర్ లైన్స్ కు 7.25 మిలియన్ డాలర్లు (రూ.58 కోట్లు) జరిమానా, 622 మిలియన్ డాలర్లు (రూ.4,960 కోట్లు) ప్రయాణికులకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. 

వేలాది మంది ప్రయాణికులకు సంబంధించిన ఫ్లైట్లు రద్దు కావడం లేదంటే పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేసినట్టు అమెరికా రవాణా మంత్రి పెటే బట్టీజింగ్ తెలిపారు. కరోనా సమయంలో ఫ్లైట్లు రద్దు కావడం, ఆలస్యం కావడం చోటు చేసుకోగా, అందుకు సంబంధించి చార్జీల రిఫండ్ కోసం ఇప్పటికీ చాలా మంది ఎదురు చూస్తున్నారు. దీంతో అమెరికా రవాణా విభాగం చర్యలకు దిగింది. టాటాలకు చెందిన ఎయిర్ ఇండియా (గతంలో ప్రభుత్వ రంగ సంస్థ) ఒక్కటే 121.5 మిలియన్ డాలర్లను (రూ.972 కోట్లు) ప్రయాణికులకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 1.4 మిలియన్ డాలర్లు జరిమానాగా చెల్లించాల్సి వస్తుంది.
Air India
pay
rs 972 crores
passenger refunds
tickets canccelation

More Telugu News