Tulasi: 100 ఏళ్ల సినిమా చరిత్రలో నా ప్రయాణం 57 ఏళ్లు: తులసి

  • బాలనటిగా మెప్పించిన 'తులసి'
  • హీరోయిన్ గాను మంచి గుర్తింపు
  • హీరోయిన్ గా తొలి సినిమా 'శుభలేఖ'
  • ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ
Tulasi Interview

తెలుగు తెరపై చైల్డ్ ఆర్టిస్టుగా సందడి చేసినవారిలో తులసి ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా ఆమె ఎన్నో సినిమాలు చేసినప్పటికీ, 'శంకరాభరణం' ఒక మైలురాయిగా కనిపిస్తుంది. ఆ తరువాత కథానాయికగా మెప్పించిన ఆమె, కేరక్టర్ ఆర్టిస్టుగా ఇప్పుడు ఫుల్ బిజీ. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. తన కెరియర్ ను గురించి ప్రస్తావించారు. 

"100 ఏళ్ల సినిమా చరిత్రలో నా ప్రయాణం 57 ఏళ్లు అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. నేను పుట్టి అప్పటికి మూడు నెలలే అవుతుంది. మా అమ్మకి సావిత్రిగారు మంచి స్నేహితురాలు. ఆమె మా ఇంటికి వచ్చి నన్ను చూశారు. ఆ మరునాడు 'భార్య' (శోభన్ బాబు - వాణిశ్రీ) సినిమా షూటింగుకి మూడు నెలల బాబు కావాలని ఎమ్మెస్ రెడ్డి గారు వెదుకుతున్నారు. అప్ప్పుడు సావిత్రిగారు నా గురించి చెప్పడంతో నన్ను తీసుకుని వెళ్లారు. 

అలా మూడో నెలలోనే కెమెరా ముందుకు వెళ్లాను. ఆ సినిమాలో రాజబాబు నన్ను ఎత్తుకుని పాట పాడతారు. ఇక మూడో ఏటలోనే ఫస్టు డైలాగ్ చెప్పాను. 'అరంగేట్రం' అనే తమిళ సినిమాలో బాలచందర్ గారు నాతో ఒక డైలాగ్ చెప్పించారు. అలా బాలనటిగా సినిమాలు చేస్తూ వెళ్లిన నేను, 'శుభలేఖ' సినిమాతో హీరోయిన్ అయ్యాను. ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News