Krishna: ఆసుపత్రి నుంచి సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయం తరలింపు

  • నానక్ రామ్ గూడలోని నివాసానికి పార్థివదేహం తరలింపు
  • సాయంత్రం అభిమానుల సందర్శనార్థం గచ్చిబౌలి స్టేడియంకు తరలింపు
  • గచ్చిబౌలి స్టేడియంలో ఇప్పటికే ఏర్పాట్లు   
Krishna Mortal shifted to home

సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి నానక్ రామ్ గూడలోని ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. పార్థివదేహాన్ని ఇంటి వద్ద కాసేపు ఉంచి, ఈ సాయంత్రానికి ఆయన భాతిక కాయాన్ని గచ్చిబౌలి స్టేడియంకు తరలిస్తారు. అభిమానుల సందర్శనార్థం అక్కడ ఉంచుతారు. గచ్చిబౌలి స్టేడియంలో ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

More Telugu News