Nityananda Swamy: నిత్యానందస్వామి ‘కైలాసం’లో ఉద్యోగాలు.. ఏడాదిపాటు వేతనంతో కూడిన శిక్షణ!

Jobs in Nityananda Swamy Kailasa Country
  • సోషల్ మీడియాలో కనిపిస్తున్న ప్రకటన
  • విశ్వవిద్యాలయం, కైలాస ఆలయాలు, ఐటీ విభాగం, రాయబార కార్యాలయాల్లో ఖాళీలంటూ ప్రచారం
  • ఏడాదిపాటు వేతనంతో కూడిన శిక్షణ
  • అర్హత సాధించిన వారికి కైలాస దేశంలో ఉద్యోగం
వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానందస్వామి ‘కైలాస దేశం’లో ఉద్యోగాలు ఉన్నాయని, దరఖాస్తు చేసుకోవచ్చంటూ ఆయన ప్రతినిధులు ప్రచారం చేసుకుంటున్నారు. భారత్‌లోని తమ శాఖల్లో ఏడాదిపాటు వేతనంతో కూడిన శిక్షణ పూర్తి చేసుకుని అర్హత సాధించిన వారికి కైలాస దేశంలో పనిచేసేందుకు అవకాశం ఇస్తామని చెబుతున్నారు.

నిత్యానంద హిందూ విశ్వవిద్యాలయం, విదేశాల్లోని దేవాలయాలు, భారతదేశంలోని కైలాస ఆలయాలు, కైలాస ఐటీ విభాగం, కైలాస రాయబార కార్యాలయం, విద్యుత్ శాఖ, గ్రంథాలయం తదితరాల్లో ఖాళీలు ఉన్నాయని చెబుతున్నారు. వాటిలో ఉచితంగా శిక్షణ పొందుతూనే వేతనం కూడా తీసుకోవచ్చని సోషల్ మీడియాలో ప్రకటనలు కనిపిస్తున్నాయి. 

కాగా, నిత్యానంద ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. శ్రీలంకలో చికిత్స చేయించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన భక్తులు అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Nityananda Swamy
Kailasa Country
Karnataka

More Telugu News