Naga Shaurya: షూటింగులో అస్వస్థతకు గురైన హీరో నాగశౌర్య.. ఆసుపత్రికి తరలింపు

Naga Shaurya hospitalised
  • షూటింగ్ లో ఉండగా సొమ్మసిల్లి పడిపోయిన నాగశౌర్య
  • గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
  • ఆందోళన చెందుతున్న అభిమానులు

టాలీవుడ్ కు ఈరోజు ఏమాత్రం బాగున్నట్టు లేదు. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి క్రిటికల్ గానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు యంగ్ హీరో నాగశౌర్య కూడా అస్వస్థతకు గురయ్యారు. షూటింగ్ లో ఉండగా ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో, వెంటనే ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరోవైపు, సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీ కోసం ఆయన డైట్ ప్యాక్ లో ఉన్నట్టు తెలుస్తోంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నారు. ఇంకోవైపు, నాగశౌర్య అస్వస్థతకు గురయ్యారనే వార్తతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

  • Loading...

More Telugu News