Jackie Shroff: 1980వ దశకం నటులు.. ఒకేచోట చేరి సందడి!

Chiranjeevi Meenakshi Sheshadri Anil Kapoor Tina Ambani Venkatesh party together at Jackie Shroffs home See pics
  • ముంబైలోని జాకీష్రాఫ్ నివాసంలో కలుసుకున్న నటులు
  • 2019లో వీరికి చిరంజీవి ఆతిథ్యం
  • కరోనా వల్ల గత రెండేళ్లుగా సమావేశానికి బ్రేక్
బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ నివాసం నటుల సంగమానికి వేదికగా నిలిచింది. 1980వ దశకానికి చెందిన నటీనటులు ముంబైలోని జాకీష్రాఫ్ నివాసంలో కలుసుకున్నారు. 1980వ తరం నటులు ఏటా కలుసుకోవడం ఒక ఆనవాయితీగా ఉంటోంది. వీరి 10వ వార్షికోత్సవం 2019లో హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో జరిగింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020, 2021లో వీరు కలుసుకోవడం సాధ్యపడలేదు. తిరిగి ఈ ఏడాది మళ్లీ ఒక్కచోటకు చేరి ఆత్మీయంగా పలుకరించుకున్నారు. తమ కెరీర్ ను గుర్తు చేసుకున్నారు.

దక్షిణాది నుంచి చిరంజీవి, వెంకటేశ్, రమ్యకృష్ణ, నరేశ్, అర్జున్, రాజ్ కుమార్, శరత్ కుమార్, భాగ్యరాజ్, భానుచందర్, సుహాసిని, మణిరత్నం, పూర్ణిమ, భాగ్యరాజ్, రాధ, అంబికా, సరిత, సుమలత, నదియా తదితరులు జాకీష్రాఫ్ నివాసంలో జరిగిన పార్టీకి హాజరయ్యారు. అలాగే, సల్మాన్ ఖాన్, విద్యాబాలన్, కంగనా రనౌత్, అక్షయ్ కుమార్, కాజోల్, మాధురీ దీక్షిత్, మహిమా చౌదరి, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, రితేశ్ దేశ్ ముఖ్ ఇలా దాదాపు ప్రముఖ నటులు అందరూ కలసి గ్రూప్ ఫొటో దిగారు. 

Jackie Shroff
home
mumbai
1980s
actors
meet
Chiranjeevi
venkatesh

More Telugu News