Pakistan: ఇంగ్లండ్ బౌలింగ్ వ్యూహాలకు పాక్ బెంబేలు... 4 వికెట్లు డౌన్

  • మెల్బోర్న్ లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్
  • టాస్ గెలిచి పాక్ కు బ్యాటింగ్ అప్పగించిన ఇంగ్లండ్
  • ఆశించిన స్థాయిలో ఆడలేకపోయిన పాక్ టాపార్డర్
  • కీలక దశలో వికెట్లు కోల్పోయిన వైనం
Pakistan lost four wickets

మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్థాన్ బ్యాటింగ్ తడబాటుకు గురైంది. 85 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రన్ రేట్ ఫర్వాలేదనిపిస్తున్నా ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (15), కెప్టెన్ బాబర్ అజామ్ (32) సహా కీలక బ్యాట్స్ మెన్ పెవిలియన్ చేరడం పాక్ భారీ స్కోరు ఆశలను దెబ్బతీసింది. 

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలింగ్ వ్యూహాలను అర్థం చేసుకోవడంలో పాక్ లైనప్ అయోమయానికి గురైంది. తొలి ఓవర్ ను బెన్ స్టోక్స్ తో వేయించిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్... సమయోచితంగా బౌలింగ్ మార్పులు చేస్తూ పాక్ బ్యాట్స్ మెన్ కు కుదురుకునే అవకాశం ఇవ్వలేదు. 

మహ్మద్ హరీస్ 8 పరుగులు చేయగా, ఇఫ్తికార్ అహ్మద్ డకౌట్ అయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ 2 వికెట్లు పడగొట్టగా, బెన్ స్టోక్స్ 1, శామ్ కరన్ 1 వికెట్ తీశారు. 

ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు 14 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లకు 98 పరుగులు చేసింది. క్రీజులో షాన్ మసూద్ (28 బ్యాటింగ్), షాదాబ్ ఖాన్ (8 బ్యాటింగ్) ఉన్నారు.

More Telugu News