Bapatla: ట్రాలీపై విమానం.. బాపట్ల జిల్లాలో ఇరుక్కుపోయిన వైనం!

Trolly which is carrying old flight stuck at Bapatla under pass
  • పాత విమానాన్ని కొచ్చిన్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా ఘటన
  • కొరిశపాడు అండర్ పాస్ వద్ద ఇరుక్కుపోయిన లారీ
  • హోటల్‌గా మార్చేందుకు విమానాన్ని కొనుగోలు చేసిన ‘పిస్తాహౌస్’
ఓ పాత విమానాన్ని కొచ్చిన్ నుంచి ట్రాలీ లారీపై హైదరాబాద్ తరలిస్తుండగా బాపట్ల జిల్లాలోని ఓ అండర్ పాస్ వద్ద ఇరుక్కుపోయింది. పాత విమానాన్ని హోటల్‌గా మార్చాలన్న ఉద్దేశంతో హైదరాబాద్‌కు చెందిన ‘పిస్తాహౌస్’ దీనిని కొనుగోలు చేసింది. ఈ క్రమంలో దీనిని హైదరాబాద్ తరలిస్తుండగా గత రాత్రి జిల్లాలోని మేదరమెట్ల బైపాస్‌లోని అండర్ పాస్ వద్ద విమానాన్ని తరలిస్తున్న ట్రాలీ ఇరుక్కుపోయింది. 

మేదరమెట్ల వద్ద కొండరాళ్లను తొలగించే పనులు ప్రారంభం కావడంతో హైదరాబాద్ వైపు వెళ్లే రోడ్డును మూసివేశారు. అటువైపు వెళ్లే వాహనాలను ఫ్లై ఓవర్ మీదుగా కొరిశపాడు అండర్ పాస్ ద్వారా మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో విమానాన్ని తరలిస్తున్న లారీ అండర్‌పాస్‌ గుండా వెళ్లే ప్రయత్నం చేయగా, మధ్యలో ఎత్తు ఎక్కువగా ఉండడంతో ఇరుక్కుపోయింది. దీంతో విమానానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా దానిని అండర్ పాస్ నుంచి బయటకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Bapatla
Pista House
Hyderabad
Flight

More Telugu News