Narendra Modi: ప్రధాని మోదీకి అపురూపమైన కానుకను బహూకరించిన దుబ్బాక ఎమ్మెల్యే

Dubbaka MLA Raghunandan Rao gifts a portrait to PM Modi
  • హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీ
  • బేగంపేటలో బీజేపీ స్వాగత సభ
  • మోదీ చెంత శ్రీరాముడు ఉన్నట్టుగా ఓ చిత్రపటం
  • బహూకరించిన రఘునందన్
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాదు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ నాయకత్వం మోదీ రాకను పురస్కరించుకుని బేగంపేటలో స్వాగత సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రధాని మోదీకి అపురూపమైన కానుకను బహూకరించారు. ప్రధాని మోదీ చెంత శ్రీరాముడు ఉన్నట్టు ఈ పటంలో చిత్రించారు. 

ఈ విశిష్ట కానుక అందుకున్న మోదీ ఎంతో సంతోషించారు. రఘునందన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, మునుగోడులో ఓటమిపాలైనప్పటికీ తెలంగాణ బీజేపీ శ్రేణులను మోదీ అభినందించారు. నికార్సయిన పోరాటం కనబరిచారంటూ కొనియాడారు. మున్ముందు కూడా ఇదే తరహాలో పోరాడాలంటూ ప్రోత్సాహ వచనాలు పలికారు.
Narendra Modi
Gift
Raghunandan Rao
Portrait
BJP
Hyderabad
Telangana

More Telugu News