నాని నిర్మాతగా 'మీట్ క్యూట్' వెబ్ సిరీస్ .. సోనీలివ్ లో

  • నాని నిర్మాతగా వెబ్ సిరీస్ 
  • దర్శకురాలిగా నాని సోదరి దీప్తి 
  • రిలేషన్స్ .. ఎమోషన్స్ ప్రధానంగా నడిచే కథ 
  • త్వరలో సోని లివ్ లో స్ట్రీమింగ్   
Meet Cute Webseries Update

నాని తన సొంత బ్యానర్లో ఓ మాదిరి బడ్జెట్ సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఆయన బ్యానర్ నుంచి ప్రేక్షకులను పలకరించడానికి 'హిట్' రెడీ అవుతోంది. అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా, డిసెంబర్ 2వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో నాని బ్యానర్ ద్వారా ఒక వెబ్ సిరీస్ కూడా నెటిజన్ల ముందుకు రానుంది. ఆ వెబ్ సిరీస్ పేరే 'కమీట్ క్యూట్'. 

నాని సోదరి దీప్తి ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించడం విశేషం. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ హక్కులను సోని లివ్ వారు దక్కించుకున్నారు. కొంత సేపటి క్రితం ఈ వెబ్ సిరీస్ నుంచి ఒక టీజర్ ను వదిలారు. జీవితంలో తారసపడే కొంతమంది వ్యక్తులు .. కొన్ని పరిచయాలు .. ప్రేమలు .. బంధాలు .. వాటి మధ్య నడిచే ఎమోషన్స్ ప్రధానంగా ఈ వెబ్ సిరీస్ సాగుతుందనే విషయం అర్థమవుతోంది. 

సత్య రాజ్ .. శివ కందుకూరి .. రోహిణి .. ఆకాంక్ష సింగ్ .. ఆదా శర్మ ... వర్ష బొల్లమ్మ వంటి ఆర్టిస్టులు ఈ టీజర్ లో కనిపించారు. టీజర్ చూస్తుంటే .. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఈ కంటెంట్ కనెక్ట్ అయ్యేలా అనిపిస్తోంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే అందుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ కూడా రానుంది.

More Telugu News