సానియా మీర్జా.. షోయబ్ మధ్య దూరం నిజమేనా?

  • ఆరోపణలకు బలమిస్తున్న సానియా పోస్ట్ లు 
  • ‘విరిగిన హృదయాలు ఎక్కడికి వెళ్లాలి’ అంటూ పోస్ట్
  • తాను సింగిల్ గా ఉన్న ఫొటోలను షేర్ చేస్తున్న టెన్నిస్ ప్లేయర్
Sania Mirza shares a pic of herself on Instagram amid divorce rumours with Shoaib Malik

టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ వైవాహిక బంధంపై ఇటీవలి కాలంలో చాలా వదంతులు, ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. షోయబ్ కు సానియా దూరంగా ఉంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీరు విడాకులు తీసుకోనున్నారనే ప్రచారం కూడా నడుస్తోంది. మరి ఈ వార్తలు నిజమేనా..? అన్న సందేహం కలుగుతోంది.

ఒకవేళ తమ వైవాహిక బంధంపై జరిగే ప్రచారం అసత్యమే అయితే.. ఇందులో నిజం లేదంటూ అటు షోయబ్ కానీ, ఇటు సానియా కానీ ఖండించడం లేదు. అసలు వీరు ఇంత వరకు స్పందించలేదు. తమ మధ్య ఏ పొరపొచ్ఛాలు లేకపోతే సెలబ్రిటీలుగా ఉన్న వీరు కచ్చితంగా వాటిని ఖండించాలి. కానీ, ఆ పని చేయడం లేదు. 

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం సానియా ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన పోస్ట్ అనుమానాలకు తావిస్తోంది. ‘‘బద్దలైన హృదయాలు ఎక్కడికి వెళతాయి? అల్లాను వెతుక్కుంటూ’’ అంటూ సానియా పోస్ట్ పెట్టింది. దీన్ని బట్టి ఎవరి హృదయం బద్దలైందని సానియా చెబుతోంది? అలాగే.. మరో పోస్ట్ లో, సానియా ఫ్లోర్ పై పడుకుని ఉంటే, ఆమె కుమారుడు ప్రేమగా ముఖంపై ముద్దు ఇస్తున్న ఫొటోను ఉంచి.. ‘భారమైన రోజుల్లో నేను గడుపుతున్న క్షణాలు’ అంటూ కొటేషన్ పెట్టింది. 

తాజాగా తాను సింగిల్ గా ఉన్న ఫొటోను సానియా ఇన్ స్టా లో షేర్ చేసింది. దీన్ని బట్టి సానియా, షోయబ్ బంధం సాఫీగా ఉందా? అన్న సందేహాలు మరింత బలపడుతున్నాయి. సానియా, షోయబ్ ప్రేమించి, 2010 ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు. వారికి 2018లో ఇజ్ హాన్ జన్మించాడు.

More Telugu News