బిగ్ బాస్ హౌస్ లో చిందులు .. చిటపటలు!

  • బిగ్ బాస్ హౌస్ లో 68వ రోజు 
  • అదిరెడ్డి తీరుపై మండిపడిన ఇనయా 
  • ఆమెపై ధోరణి పట్ల ఫైమా ఆగ్రహావేశాలు
  • రేవంత్ మాటతీరును తప్పుబట్టిన శ్రీ సత్య 
  • కెప్టెన్ గా ఫైమా .. జైలుకెళ్లిన ఇనయా  
Bigg Boss 6  Update

బిగ్ బాస్ హౌస్ లో 68వ రోజు పోటీదారుల మధ్య గొడవలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది .. అదేమిటంటే ఫైమా కెప్టెన్ కావడం .. ఇనయా జైలుకెళ్లడం. థర్మాకోల్ బాల్స్ కి సంబంధించిన ఆటలో గెలిచిన ఫైమా కెప్టెన్ అయింది. అయితే ఆమె గెలవడానికి కారణం ఆదిరెడ్డి అనీ, ఆయన సపోర్టు చేయడం వల్లనే ఫైమా గెలిచిందని ఇనయా ఆరోపించింది. ఫైమాను గెలిపించవలసిన అవసరం తనకేంటంటూ ఆదిరెడ్డి ఆమెపై ఎదురుదాడికి దిగాడు. అదే సమయంలో ఆదిరెడ్డి సాయం తీసుకుని గెలవాల్సిన అవసరం తనకి లేదంటూ ఫైమా కూడా రంగంలోకి దిగింది. 

ఇక రేవంత్ - శ్రీసత్య మధ్య కూడా ఇదే తరహాలో మాటల యుద్ధం కొనసాగింది. ఈ వారం హౌస్ లోని పోటీదారులలో వరస్ట్ కంటెస్టెంట్ ఎవరనేది చెబుతూ వారి ముఖం పై రెడ్ కలర్ క్రాస్ మార్క్ వేయమని బిగ్ బాస్ ఆదేశించాడు. ఆ ప్రకారం రేవంత్ ముఖంపై శ్రీసత్య క్రాస్ మార్క్ వేసింది. థర్మాకోల్ బాల్స్ ఆటలో సంచాలకుడిగా రేవంత్ ఫెయిలయ్యాడంటూ ఆరోపించింది. అంతేకాకుండా అతని ఆటతీరులో మార్పు వచ్చిందంటూ తన గురించి అతను శ్రీహాన్ తో మాట్లాడటం గురించి ప్రస్తావించింది. దాంతో రేవంత్ కూడా ఆమె ధోరణి పట్ల మండిపడ్డాడు. 

ఇలా ఈ వారం వరస్ట్ కంటెస్టెంట్ ఎవరనే విషయంలో ఎవరికి వారు, ఎదుటివారిలోని లోపాలను చెబుతూ వెళ్లారు. చివరికి చూస్తే ఎక్కువమందిచే క్రాస్ మార్క్ పడిన సభ్యురాలిగా ఇనయా నిలిచింది. దాంతో నియమం ప్రకారం ఆమెను జైలుకు పంపించారు. ఇలా ఆదిరెడ్డి .. ఇనయా .. ఫైమా .. శ్రీసత్య .. రేవంత్ పరస్పర ఆరోపణలతో ఈ ఎపిసోడ్ కొనసాగింది. గతంలో కంటే భిన్నంగా ఆదిరెడ్డి ప్రవర్తించడం హౌస్ లోని వారికే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఫైమా కెప్టెన్ అయ్యే విషయంలో నానా రచ్చ చేసిన ఇనయా, ఆమె గెలవగానే పరిగెత్తుకువెళ్లి హగ్ చేసుకోవడం కొసమెరుపు.

More Telugu News