Diana Ramirez: మోడలింగ్ కోసం ఉద్యోగాన్ని వీడనంటున్న 'అత్యంత అందమైన పోలీసు'!

Here it is Most Beautiful Lady Cop
  • సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్న డయానా రమిరెజ్
  • డయానా కొలంబియాలో పోలీసాఫీసర్
  • అపురూప సౌందర్యరాశిగా నెటిజన్ల నుంచి కితాబు
  • ప్రమాదకర నగరంలో విధి నిర్వహణ
ఆమె పేరు డయానా రమిరెజ్. కొలంబియాలో ఓ పోలీసు అధికారిణి. కఠినమైన సవాళ్లతో కూడుకున్న పోలీసు వృత్తిలో కొనసాగుతున్న డయానా రమిరెజ్ సోషల్ మీడియాలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకు 4 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. అందుకు కారణం ఆమె అందచందాలే. ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళా పోలీసు అని నెటిజన్లు ఆమెను అభివర్ణించడంలో అతిశయోక్తి ఏమీ లేదనిపిస్తుంది. ఆమె రూప లావణ్యం అలాంటిది మరి. 

సోషల్ మీడియాలో డయానా రమిరెజ్ ఫొటోలు చూసినవారు ఆమె ఓ మోడల్ అని భావిస్తుంటారు. అయితే యూనిఫాంలో ఉన్న ఫొటోలు చూసిన తర్వాత ఆమె ఓ లేడీ పోలీసాఫీసర్ అన్న విషయం అర్థమవుతుంది. 

కాగా, కొలంబియాలోని మెడెలిన్ నగరం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఉండే నగరాల్లో ఒకటి. అయినప్పటికీ, డయానా రమిరెజ్ పోలీసు ఉద్యోగాన్ని ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తూ డిపార్ట్ మెంట్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఒకవేళ మరోసారి కెరీర్ ను ఎంచుకునే అవకాశం వస్తే, తాను మళ్లీ పోలీసే అవుతానని ఆమె స్పష్టం చేశారు. మోడలింగ్ రంగంలో అవకాశం వచ్చినా పోలీసు ఉద్యోగాన్ని మాత్రం వీడనని చెబుతున్నారు. నేనేంటో నిరూపించుకునేందుకు అవకాశం ఇచ్చింది పోలీస్ డిపార్ట్ మెంటేనని డయానా పేర్కొన్నారు.
Diana Ramirez
Most Beautiful
Police
Columbia

More Telugu News