Janhvi Kapoor: ‘ఓం శాంతి ఓమ్’ లో దీపికా సీన్ ను కాపీ కొట్టిన జాన్వీ కపూర్

Janhvi Kapoor recreates Deepika Padukone scene from Om Shanti Om watch vedio
  • ఏక వస్త్రంతో అందాలు ఆరబోసిన జాన్వీ
  • ఇన్ స్టా గ్రామ్ లో వీడియో పోస్ట్
  • ఈ శాంతి భిన్నంగా కనిపిస్తుందంటూ డైలాగ్
  • అభిమానుల నుంచి భిన్న స్పందన
జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది. తరచూ అభిమానుల చర్చల్లో తానుండాలన్న ఆకాంక్షతో ఉన్నట్టుగా ఆమె పనులు కనిపిస్తుంటాయి. ఎక్స్ పోజింగ్ లేకుండా గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవికి కుమార్తె అయిన జాన్వీ.. ఎక్స్ పోజింగ్ లో హద్దే లేదన్నట్టు వ్యవహరిస్తుండడం అభిమానులకు తెలిసిందే. అంతేకాదు, ఇటీవల ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తాను హాట్ గా ఉన్నానా? అంటూ అభిమానులకు ప్రశ్న కూడా సంధించింది. ఇదంతా తన అభిమానగణాన్ని పెంచుకునే పనిగానే అనిపిస్తుంటుంది.

తాజాగా జాన్వీ కపూర్ ఓ చిలిపి పని చేసింది. ఓం శాంతి ఓం సినిమాలో దీపికా పదుకొణె నటించిన ఓ సన్నివేశానికి అనుకరణ చేసి, ఆ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఎప్పటి మాదిరే ఇందులోనూ జాన్వీ అందాల ప్రదర్శన చేయకుండా ఉండలేకపోయింది. 

పై నుంచి పాదాల వరకు ఏక వస్త్రాన్ని ధరించిన ఆమె ‘‘ఈ శాంతి చూడ్డానికి చాలా భిన్నంగా కనిపిస్తోంది. శాంతి మృతదేహం ఈ షాండ్లియర్ కింద చూడొచ్చు’’ అంటూ డైలాగ్ చెప్పేసింది. ఆ వెంటనే వీడియోను అక్కడే ఉన్న నేలవైపు తిప్పగా.. కపూర్ స్నేహితుడు కింద పడుకుని నవ్వుతూ కనిపించడాన్ని చూడొచ్చు. దీనికి అభిమానులు కూడా భిన్నంగానే స్పందిస్తున్నారు. ఓ యూజర్ కామెడీగా.. ‘ఇది శాంతి కాదు. శాంతీలాల్’అని కామెంట్ చేయడం గమనార్హం. (ఇన్ స్టాగ్రామ్ వీడియో కోసం)
Janhvi Kapoor
expose
Deepika Padukone
Om Shanti Om

More Telugu News