Fire Accident: పశ్చిమ గోదావరి జిల్లాలో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు

Huge explosion in fire crackers industry in West Godavari district
  • తాడేపల్లిగూడెం కడియద్ద  వద్ద పేలుడు
  • ముగ్గురి మృతి.. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
  • పేలుడుతో హడలిపోయిన స్థానికులు
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం కడియద్ద గ్రామంలో ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, పేలుడు జరిగిన బాణసంచా పరిశ్రమ అన్నవరం అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. 

ఈ పేలుడు ఘటన పట్ల అగ్నిమాపక దళం వెంటనే స్పందించింది. ఈ పరిశ్రమ ఊరి చివర చెరువు వద్ద ఉండడంతో అగ్నిమాపక శకటం అక్కడికి చేరుకోవడానికి కొంచెం సమయం పట్టింది. అప్పటికీ, ప్రమాద స్థలికి 300 మీటర్ల దూరంలోనే అగ్నిమాపక శకటం నిలిపివేయాల్సి వచ్చింది. 

అటు, ప్రమాదం జరిగిన సమయంలో బాణసంచా కర్మాగారంలో 10 మంది ఉన్నట్టు భావిస్తున్నారు. ఒక్కసారిగా విస్ఫోటనం చెందడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Fire Accident
Fire Crackers Industry
Tadepalligudem Mandal
West Godavari District

More Telugu News