Virat Kohli: అంతర్జాతీయ టీ20 చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు

Kohli becomes first batter in T20I history by making 4000 runs
  • టీ20 వరల్డ్ కప్ లో భారత్, ఇంగ్లండ్ మధ్య సెమీస్
  • 50 పరుగులు చేసిన కోహ్లీ
  • అంతర్జాతీయ టీ20ల్లో 4 వేల పరుగులు సాధించిన వైనం
  • తొలి బ్యాట్స్ మన్ గా రికార్డు
ఇంగ్లండ్ తో టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో అర్ధసెంచరీ సాధించిన కోహ్లీ, అంతర్జాతీయ టీ20 చరిత్రలో 4 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాట్స్ మన్ గా రికార్డు పుటల్లోకెక్కాడు. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో 42 పరుగులు చేసిన అనంతరం కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. 

ఇప్పుడు పురుషుల అంతర్జాతీయ టీ20 పోటీల్లో అత్యధిక పరుగుల వీరుడు కోహ్లీనే. ఇప్పటిదాకా 115 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 52.74 సగటు, 137.97 స్ట్రయిక్ రేట్ తో మొత్తం 4,008 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 37 అర్ధసెంచరీలు ఉన్నాయి. 

కాగా ఈ జాబితాలో కోహ్లీ తర్వాత స్థానంలో రోహిత్ శర్మ, మార్టిన్ గప్టిల్, బాబర్ అజామ్, పాల్ స్టిర్లింగ్, ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హఫీజ్, జోస్ బట్లర్ ఉన్నారు.
Virat Kohli
T20I
Most Runs
Batsman
England
Semifinal
T20 World Cup

More Telugu News