Nagashourya: ఓ ఇంటివాడు అవుతున్న నాగశౌర్య!

Nagashourya Wedding Confirmed
  • లవర్ బాయ్ గా నాగశౌర్యకి క్రేజ్ 
  • వరుస సినిమాలతో తను చాలా బిజీ 
  • అనూషతో కుదిరిన సంబంధం 
  • బెంగళూరులో జరగనున్న వివాహం
తెలుగు తెరపై హీరోగా నాగశౌర్య తన ప్రయాణాన్ని మొదలుపెట్టి దాదాపు పుష్కరకాలం కావొస్తోంది. ఈ 12 ఏళ్లలో ఆయన పాతిక సినిమాల సంఖ్యకి చేరుకున్నాడు. ఇటీవలే ఆయన 24వ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది. త్వరలో సెట్స్ పైకి రావడానికి మరో  రెండు ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. లవర్ బాయ్ గా ..  హ్యాండ్సమ్ హీరోగా .. రొమాంటిక్ హీరోగా ఆయన మంచి మార్కులు కొట్టేశాడు. 

ఒక వైపున బయట బ్యానర్లలోని సినిమాలతో .. మరో వైపున సొంత సినిమాలతో నాగశౌర్య బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు ప్రాజెక్టుల వరకూ ఉన్నాయి. ఆ సినిమాలను లైన్లో పెట్టే పనిలోనే ఆయన ఉన్నాడు. వైవిధ్యం విషయంలోనే ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన పెళ్లి కొడుకు అవుతున్నాడనే విషయాన్ని పీఆర్వో వంశీ కాక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 

అనూషతో నాగశౌర్య వివాహం జరగనున్నట్టుగా ఆయన చెప్పారు. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఈ నెల 19 .. 20 తేదీలలో బెంగళూరులో జరుగుతాయనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అనూష ఎవరు? ఆమె ఫ్యామిలీ నేపథ్యం ఏమిటనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి నాగశౌర్య ఒక ఇంటివాడు అవుతున్నాడన్న మాట.
Nagashourya
Anusha
Bengaluru

More Telugu News