Samantha: ఎంతో ఉత్కంఠగా ఉన్నా: సమంత

Feeling excited says Samantha before release of Yashoda movie
  • రేపు విడుదలవుతున్న 'యశోద'
  • ఈ సినిమా మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నానన్న సామ్
  • ఇంకొక్క రోజు మాత్రమే ఉందంటూ ట్వీట్
తన సుదీర్థ సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్నమయినటువంటి పాత్రలను సమంత పోషించింది. గ్లామర్ పాత్రలనే కాకుండా, మహిళా ప్రాధాన్యత ఉన్న ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకుల అభినందనలను అందుకుంది. ఆమె తాజా చిత్రం 'యశోద' రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఎంతో ఉత్కంఠగా ఉన్నానని సామ్ తెలిపింది. ఇంకొక్క రోజు మాత్రమే ఉందని చెప్పింది. మీ అందరికీ 'యశోద' నచ్చాలని గట్టిగా కోరుకుంటున్నానని తెలిపింది. రేపటి మీ తీర్పు కోసం నా మాదిరే ఎదురు చూస్తున్న నా దర్శకులు, నిర్మాతలు, తారాగణం, మొత్తం సిబ్బందికి శుభాకాంక్షలు చెపుతున్నానని ట్వీట్ చేసింది. 

మరోవైపు మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూనే సమంత ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. తన వృత్తిపై ఆమెకున్న నిబద్ధతను అందరూ కొనియాడుతున్నారు. సామ్ తో పాటు ఆమె అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Samantha
Yashoda
Tollywood

More Telugu News