రామ్–బోయపాటి సినిమా కొత్త అప్ డేట్

  • రామ్ 20వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న బోయపాటి
  • రామోజీ ఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ మొదలు 
  • స్టన్ శివ యాక్షన్ కొరియోగ్రఫీలో ఫైట్ సీన్స్ చిత్రీకరణ
Ram Pothinenis Boyapati RAPO Goes On Floors With High Octane Action Sequence

క్లాస్, మాస్ సినిమాలతో టాలీవుడ్ లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ హీరో పోతినేని రామ్‌. దేవదాసు నుంచి పండగ చేస్కో, నేను శైలజ, హలో గురు ప్రేమ కోసమే, ఇస్మార్ట్ శంకర్, రెడ్ వరకు ప్రతీసారి వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకొచ్చే ప్రయత్నం చేశాడు. వారియర్ చిత్రం తర్వాత రామ్ ఇప్పుడు మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఇక ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. రామ్‌కి ఇది 20 సినిమా. ‘ర్యాపో 20’ వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ను పూర్తిచేశారు. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టారు. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ స్టన్ శివ వైవిధ్యమైన యాక్షన్ ఫైట్స్ సమకూర్చాడని తెలుస్తోంది. 

బోయపాటి సినిమాల్లో సాధారణంగానే యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుంది. ఇందుకు తగ్గట్టే ఈ చిత్రంలోనూ ఫైట్స్ ఉండాలని స్టన్ శివకు స్పష్టం చేశాడట. తన స్టయిల్, రామ్ బాడీ లాంగ్వెజ్ కు సరిపోయే యాక్షన్ సీక్వెల్స్ ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇచ్చేలా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ సరసన యువ నటి శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇతర నటీనటుల వివరాలను వెల్లడించాల్సి ఉంది.

More Telugu News