లైకా ప్రొడక్షన్స్ వారి నెక్ట్ మూవీ ఇదే .. ఫస్టులుక్ రిలీజ్!

  • అథర్వమురళి హీరోగా 'పట్టాతు అరసన్'
  • కథానాయికగా ఆషిక రంగనాథ్ 
  • సంగీత దర్శకత్వం వహిస్తున్న గిబ్రాన్
  • కీలకమైన పాత్రను పోషిస్తున్న రాధిక
Pattahu Arasan fristloook poster released

ఈ మధ్య కాలంలో భారీ చిత్రాల నిర్మాణ సంస్థగా 'లైకా'వారి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. వందల కోట్ల బడ్జెట్ తో ఒకే సమయంలో రెండు మూడు ప్రాజెక్టులను వాళ్లు నడిపిస్తుండటం విశేషం. లైకా ప్రొడక్షన్స్ అనే బ్యానర్ పేరును చూడగానే, ఆ సినిమా భారీగా ఉంటుందనే ఒక నమ్మకం అందరిలో బలపడిపోయింది. ఆ సినిమాలో భారీతారాగణం ఉంటుందనే విషయం అర్థమైపోతుంది. 

అలాంటి లైకా వారు తమ బ్యానర్లో నెక్స్ట్ రిలీజ్ కానున్న సినిమా ఏమిటనేది ఈ రోజున చెబుతామంటూ నిన్ననే ఒక ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు. అందుకు సంబంధించిన అప్ డేట్ కొంతసేపటి క్రితమే ఇచ్చారు. లైకా ప్రొడక్షన్స్ లో నిర్మితమవుతున్న ఆ సినిమా పేరే 'పట్టాతు అరసన్'. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

పోస్టర్ చూస్తుంటే ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ అనే విషయం అర్థమవుతోంది. అక్కడి పెద్దరికం .. దానిని ఎదిరించేవారిని ఎదుర్కోవడం కథలో ప్రధానమైన అంశం కావొచ్చునని అనిపిస్తోంది. ఈ సినిమాలో మాస్ లుక్ తో అథర్వ మురళి నటిస్తుండగా, అతని సరసన నాయికగా ఆషిక రంగనాథ్ కనిపించనుంది. కీలకమైన పాత్రను రాధిక పోషిస్తోంది. సర్కుణం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

More Telugu News