Samantha: రేపు రిలీజ్ కానున్న 'యశోద' .. సమంత ఫ్యాన్సులో ఉత్కంఠ!

Yashoda Movie Update
  • లేడీ ఓరియెంటెడ్ మూవీగా 'యశోద'
  • అంచనాలు పెంచేసిన టీజర్ .. ట్రైలర్ 
  • అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమా 
  • మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు
సమంత కథానాయికగా వెండితెరకి పరిచయమై పుష్కరకాలం గడిచిపోయింది. సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించింది. స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. 'రంగస్థలం' తరువాత ఆమె ఎక్కువగా ఉమెన్ సెంట్రిక్ కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది. 'యూ టర్న్' .. 'ఓ బేబీ' వంటి సినిమాలు నటిగా ఆమె స్థాయిని చాటిచెప్పాయి. 

గుణశేఖర్ వంటి దర్శకుడు సమంతను టైటిల్ రోల్ కోసం తీసుకుని, పాన్ ఇండియా సినిమాగా 'శాకుంతలం' చేశారంటే నటిగా ఆమెపై ఆయనకి గల నమ్మకం .. ప్రజల్లో ఆమె పట్ల గల క్రేజ్ ను అంచనా వేసుకోవచ్చు. అద్భుతమైన దృశ్యకావ్యంగా ఆ సినిమాను ఆయన తీర్చిదిద్దుతున్నాడు. అయితే ఆ సినిమాకంటే ముందుగానే 'యశోద' సినిమా థియేటర్లకు వచ్చేస్తోంది. రేపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలవుతోంది. 

ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ .. ట్రైలర్ జనంలో ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతూ వెళ్లాయి. సమంత ఎమోషన్ తో పాటు యాక్షన్ కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుంది. గతంలో సమంత చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక ఎత్తు అనేంత స్థాయిలో ఈ సినిమాపై బజ్ పెరిగిపోయింది. ఇది నటన పరంగా సమంతను మరో పది మెట్లు ఎక్కించే సినిమా అవుతుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. విడుదలకి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో ఉత్కంఠకు లోనవుతున్నారు. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకి రిలీజ్ కి ముందే ఈ స్థాయి బజ్ ఉండటం ఈ మధ్య కాలంలో  ఈ సినిమా విషయంలోనే జరిగిందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
Samantha
Varalakshmi Sharath Kumar
Unni Mukundan
Yashoda Movie

More Telugu News