Hollywood: ఉక్రెయిన్ అధ్యక్షుడికి తన ఆస్కార్ అవార్డును ఇచ్చిన హాలీవుడ్ స్టార్

  • కీవ్ నగరాన్ని సందర్శించి ఆస్కార్ ను బహుమతిగా అందజేసిన షాన్ పెన్
  • అమెరికా నటుడికి ఉక్రెయిన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారం ఇచ్చిన జెలెన్ స్కీ
  • రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్ ప్రజలను ఏకం చేశారని జెలెన్ స్కీకి పెన్ కితాబు
Hollywood actor Sean Penn gifts his Oscar to Ukrainian President Zelenskyy

హాలీవుడ్ నటుడు, అమెరికాకు చెందిన షాన్ పెన్ తన ఆస్కార్ అవార్డులలో ఒకదానిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ఇచ్చారు. ఆ దేశ రాజధాని కీవ్ ను సందర్శించి ఆస్కార్ ను ఆయనకు బహుమతిగా అందించారు. ఈ విషయాన్ని జెలెన్ స్కీ తన టెలిగ్రామ్ ఛానెల్‌లో... పెన్‌తో కలిసి ఉన్న వీడియోను పోస్ట్ చేయడం ద్వారా తెలిపారు. అదే సమయంలో జెలెన్ స్కీ తమ దేశ ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్‌’ పురస్కారాన్ని పెన్ కు ప్రదానం చేశారు. సీన్ పెన్ ప్రపంచ స్థాయి నటుడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఉంటున్నారు. 

మార్చిలో, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత హాలీవుడ్ నటుడు తన మొదటి టెలివిజన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సీన్ పెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో తన సమావేశాలపై మాట్లాడారు. దాడికి ముందు, తర్వాత ఆయనను కలిశానని చెప్పారు. ధైర్యం, గౌరవం, ప్రేమతో జెలెన్ స్కీ ఉక్రెయిన్ ను ఏకం చేని అందరినీ ఆకట్టుకున్నారని కొనియాడారు. ఇలాంటి విషయం ఆధునిక ప్రపంచంలో ఇదే తొలిసారి అని అభిప్రాయపడ్డాడు.

More Telugu News