అర్జున్ దర్శకత్వంలో రూపొందే సినిమా.. విష్వక్సేన్ స్థానంలో తెరపైకి వచ్చిన మరో హీరో పేరు!

  • టాలీవుడ్ కి తన కూతురును పరిచయం చేస్తున్న అర్జున్
  • ప్రాజెక్టు నుంచి తప్పుకున్న విష్వక్సేన్   
  • ఆరంభంలోనే ఆగిపోయిన ప్రాజెక్టు
  • శర్వానంద్ ను ఒప్పించనున్నారంటూ టాక్
Sharwanand in Arjun Movie

తమిళ .. కన్నడ భాషల్లో తన కూతురు ఐశ్వర్యతో సినిమాలు చేసిన అర్జున్, తెలుగులోను ఆమెను పరిచయం చేయడానికి రంగంలోకి దిగారు. ఈ సినిమాలో హీరోగా విష్వక్సేన్ ను తీసుకున్నారు. కొంతవరకూ షూటింగు నడిచిన తరువాత తేడా వచ్చేసింది. విష్వక్ తీరు పట్ల అర్జున్ అసహనాన్ని ప్రదర్శించడమే కాకుండా, మరో హీరోతో ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకుని వెళ్లనున్నట్టు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు.

తెలుగుతో తన కూతురు ఫస్టు సినిమా కావడంతో అర్జున్ కి ఈ సినిమా సెంటిమెంట్. అందువలన ఆయన దీనిని ఆపేసే ఆలోచనలో లేరు. పైగా తాను పని ఇస్తానని చెప్పి తీసుకొచ్చిన ఏ టెక్నీషియన్ ను కూడా పని లేదని చెప్పి వెనక్కి పంపించడం తనకి అలవాటు లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అందువలన సాధ్యమైనంత త్వరగా మరో హీరోతో ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. 

ఈ కథకి శర్వానంద్ కరెక్టుగా సరిపోతాడని భావించిన ఆయన, ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. శర్వానంద్ మొదటి నుంచి కూడా చాలా కూల్ గా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. చాలా కాలం తరువాత 'ఒకే ఒక జీవితం' సినిమాతో ఆయన హిట్ అందుకున్నాడు. అలాంటి శర్వానంద్ ను అర్జున్ ఎంతవరకూ ఒప్పించగలుగుతారనేది చూడాలి.

More Telugu News