Telangana: కమ్యూనిస్టుల ప్రచారంతోనే మునుగోడులో టీఆర్ఎస్ కు గెలుపు: మంత్రి జగదీశ్ రెడ్డి

ts minister thanked cpi leaders over trs victory in munugode
  • మునుగోడులో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్
  • కూసుకుంట్లను వెంటేసుకుని వామపక్ష పార్టీల కార్యాలయాలకు వెళ్లిన జగదీశ్ రెడ్డి
  • భవిష్యత్తులోనూ వామపక్షాలతో కలిసి సాగనున్నట్లు వెల్లడి

హోరాహోరీగా సాగిన మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేసింది. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్ లోని సీపీఐ, సీపీఎం పార్టీల కార్యాలయాలకు వచ్చిన జగదీశ్ రెడ్డి... ఆ పార్టీ నేతలు కూనంనేని సాంబశివరావు, చాడా వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డిలతో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేసినందుకు కమ్యూనిస్టు పార్టీల నేతలకు వారు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జగదీశ్ రెడ్డి... మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టుల ప్రచారంతోనే టీఆర్ఎస్ విజయం సాధించిందని చెప్పారు. భవిష్యత్తులోనూ కమ్యూనిస్టులతో కలిసే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ ప్రతిపాదనకు సీపీఐ, సీపీఎం నేతలు కూడా సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా తెలంగాణను పెద్ద విపత్తు నుంచి కాపాడామనే సంతోషం తమకూ ఉందని ఈ సందర్భంగా కూనంనేని తెలిపారు.

  • Loading...

More Telugu News