AP: విభజన సమస్యలపై ఈ నెల 23న కీలక భేటీ.... తప్పనిసరిగా రావాలంటూ ఏపీ, తెలంగాణలకు సమాచారం పంపిన కేంద్రం

  • 2014లో విడిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
  • ఇప్పటికీ పరిష్కారం కాని పలు సమస్యలు
  • మరోసారి చర్చలకు ముహూర్తం నిర్ణయించిన కేంద్రం
  • కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం
Union Home ministry organizes meeting on bifurcation issues on November 23

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎనిమిదేళ్ల కిందట ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. విభజన చట్టంలోని హామీలు, ఇతర అంశాలు పూర్తిచేసేందుకు పదేళ్లు గడువుగా పేర్కొన్నారు. అయితే, విభజన సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో, ఇరు రాష్ట్రాలతో చర్చలకు కేంద్రం ముహూర్తం నిర్ణయించింది. ఈ నెల 23న దేశ రాజధాని ఢిల్లీలో విభజన సమస్యలపై సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కీలక భేటీకి తప్పనిసరిగా హాజరు కావాలంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సమాచారం పంపింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించనున్నారు.

More Telugu News