Lava Blaze 5G: రూ.10 వేలకే లావా 5జీ ఫోన్

Lava Blaze 5G Indias most affordable 5G phone launched under Rs 10000
  • లావా బ్లేజ్ 5జీ పేరుతో విడుదల
  • 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
  • 2కే వీడియో రికార్డింగ్ ఫీచర్
  • వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ కెమెరా
దేశీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ ‘లావా’ బడ్జెట్ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. లావా బ్లేజ్ 5జీ పేరుతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.9,999. ఇది కేవలం ఆరంభ ధర మాత్రమే అని కంపెనీ తెలిపింది. అంటే తర్వాత ఈ ధర కొంత పెరిగే అవకాశం ఉంటుంది. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వచ్చే ఈ ఫోన్లో, 6.51 అంగుళాల హెచ్ డీ ప్లస్ ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ సెట్ పై పనిచేస్తుంది. 

వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. 50 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, మరో రెండు సెన్సార్లను ఏర్పాటు చేయగా, ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ప్రధాన కెమెరాతో 2కే వీడియోలను రికార్డ్ చేయొచ్చని కంపెనీ ప్రకటించింది. కెమెరా పరంగా చాలా ఫీచర్లున్నాయి. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. తక్కువ ధరలో 5జీ ఫోన్ కోసం చూసే వారికి ఇది మంచి ఎంపిక.
Lava Blaze 5G
launched
Rs 9999
budget 5g phone

More Telugu News