అటు శ్రీహాన్ పై కీర్తి .. ఇటు ఇనయాపై ఫైమా ఫైర్!

  • బిగ్ బాస్ హౌస్ లో జోరుగా జరిగిన నామినేషన్స్ 
  • ఎక్కువసార్లు నామినేట్ అయిన ఇనయా 
  • ఆ తరువాత స్థానాల్లో శ్రీహాన్ - ఆది రెడ్డి
  • శ్రీహాన్ ధోరణి పట్ల కీర్తి అసహనం
Bigg Boss 6  Update

బిగ్ బాస్ హౌస్ లో నిన్న రాత్రి నామినేషన్స్ ప్రక్రియ ఆసక్తికరంగా కొనసాగింది. హౌస్ లోని సభ్యులు ఒక స్టాండ్ పై తలపెడితే, వారి ముఖంపై ఎరుపురంగు నీళ్లు కొట్టి నామినేట్ చేయాలి. నామినేట్ చేయడానికిగల కారణం ఏమిటనేది చెప్పాలి. హౌస్ లోని సభ్యులలో చాలామంది ఇనయాను నామినేట్ చేశారు. ఆమె ప్రవర్తనపట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఇనయా వంతు వచ్చేసరికి ఆమె ఫైమాను నామినేట్ చేసింది. ఆటల్లో ఫైమా తీరును తప్పుబట్టింది. గీతూను చూసి నేర్చుకున్నావంటూ నిందించింది. 

ఇనయా అలా అనడంతో ఫైమా ఒక్కసారిగా మండిపడింది. ఇకనైనా యాక్టింగ్ మానుకోమని చెప్పింది. ఆమె ఫేక్ .. ఆమె ఆటతీరు ఫేక్ అంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది. ఆట గురించి ఆమె మాట్లాడటం చూస్తే తనకి నవ్వు వస్తుందంటూ రెచ్చగొట్టింది. అసలు నిన్ను చూస్తేనే నాకు చిరాగ్గా ఉంటుందంటూ కవ్వించింది. ఇక ఇనయా కూడా తనదైన స్టైల్లో ఫైమాపై మండిపడుతూనే ఉంది. ఇద్దరి మధ్య కూడా వాదన ఒక రేంజ్ లో కొనసాగింది. 


ఇక ఇనయాను శ్రీహాన్ నామినేట్ చేసినప్పుడు కూడా ఇద్దరి మధ్య వాదన జరిగింది. తన విషయంలో ఇనయా చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అసహనాన్ని ప్రదర్శించాడు. ఇక ఆయన కీర్తిని నామినేట్ చేసినప్పుడు కూడా, ఆమె నుంచి తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీహాన్ డబుల్ గేమ్ ఆడుతున్నాడనీ .. ఆయన ఓ అపరిచితుడు అంటూ మాట్లాడింది. అందుకు శ్రీహాన్ కూడా తీవ్రంగానే స్పందించాడు. ఇక ఆదిరెడ్డి - రేవంత్ మధ్య కూడా ఇదే తరహా గొడవ జరిగింది. ఈ సారి ఇనయా తరువాత ఆదిరెడ్డి - శ్రీహాన్ ఎక్కువమందిచే నామినేట్ కావడం విశేషం.

More Telugu News