Telangana: తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్ మెంట్ ఫెడరేషన్ చైర్మన్ గా సోమా భరత్ కుమార్ నియామకం

soma bharath kumar appointed as chairman for The Telangana State Dairy Development Cooperative Federation Ltd
  • రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న భరత్ కుమార్
  • సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్న వైనం
  • డెయిరీ రంగం అభివృద్దికి కృషి చేస్తానని వెల్లడి
తెలంగాణ ప్రభుత్వం సోమవారం మరో నామినేటెడ్ పదవిని భర్తీ చేసింది. తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా సోమా భరత్ కుమార్ ను నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సోమా భరత్ కుమార్ నియామక ఉత్తర్వులను అందుకున్నారు. ఈ పదవిలో భరత్ కుమార్ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవిలో నియమించిన కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో డెయిరీ రంగం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
Telangana
TRS
KCR
Soma Bharath Kumar
The Telangana State Dairy Development Cooperative Federation Ltd

More Telugu News