Nirmala Sitharaman: బ్యాంకుల నిరర్ధక ఆస్తుల తగ్గింపునకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయి: నిర్మలా సీతారామన్

  • సెప్టెంబరు త్రైమాసికంపై నిర్మల ప్రెస్ మీట్
  • ప్రభుత్వ బ్యాంకుల సంయుక్త లాభాలపై వివరణ
  • 50 శాతం లాభాలు నమోదు చేసినట్టు వెల్లడి
Nirmala Sitharaman explains September quarter

రెండో త్రైమాసికం, బ్యాంకులు తదితర అంశాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించార. బ్యాంకుల నిరర్ధక ఆస్తులను తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయని వెల్లడించారు. సెప్టెంబరు త్రైమాసికంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల సంయుక్త లాభాలు 50 శాతం పెరిగి రూ.25,685 కోట్లుగా నమోదు కావడమే అందుకు నిదర్శనమని తెలిపారు. 

ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో బ్యాంకుల నికర లాభాలు 32 శాతం పెరిగి రూ.40,991 కోట్లకు చేరాయని నిర్మలా సీతారామన్ వివరించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) లాభాలు వార్షిక ప్రాతిపదికన 74 శాతం పెరిగి రూ.13,265 కోట్లుగా నమోదైనట్టు వెల్లడించారు. 

అటు, కెనరా బ్యాంకు కూడా లాభాల బాటలో పయనించిందని తెలిపారు. సెప్టెంబరు త్రైమాసికంలో కెనరా బ్యాంకు లాభాలు 89 శాతం పెరిగి రూ.2,525 కోట్లకు చేరినట్టు నిర్మల చెప్పారు. 

కోల్ కతా కేంద్రంగా పనిచేస్తున్న యూకో బ్యాంకు లాభం భారీస్థాయిలో 145 శాతం పెరిగి రూ.504 కోట్లకు చేరిందని, బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం 58.70 శాతం పెరుగుదలతో రూ.3.312 కోట్లకు పెరిగిందని వివరించారు.

More Telugu News