Anushka Shetty: 'అన్విత రవళి'గా అనుష్క .. ఫస్టులుక్ రిలీజ్!

Anushka Frist Look released
  • 48వ సినిమా షూటింగులో అనుష్క 
  • బర్త్ డే సందర్భంగా ఫస్టు లుక్ రిలీజ్ 
  • ముఖ్యమైన పాత్రలో నవీన్ పోలిశెట్టి
  • రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో సాగే కథ
  • దర్శకత్వం వహిస్తున్న మహేశ్ పి  

తెలుగు .. తమిళ భాషల్లో అగ్రకథానాయికగా రాణించిన అనుష్క కొంతకాలంగా ఆమె ఇటు తెలుగులో గానీ .. అటు తమిళంలో గాని సినిమాలు చేయడం లేదు. అనుష్క ఇక సినిమాలు చేయడం మానుకున్నట్టేననే ప్రచారం కూడా జోరుగానే జరుగుతోంది. 'సైలెన్స్' సినిమా తరువాత ఆమె నుంచి మరో సినిమా రాకపోవడమే అందుకు కారణం. 

ఈ నేపథ్యంలోనే యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఒక సినిమా చేయడానికి అనుష్క అంగీకరించినట్టుగా ఒక వార్త వినిపించింది. నాయిక ప్రధానమైన ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్స్ మాత్రం లేవు. ఈ రోజున అనుష్క పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఆమె పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

పి.మహేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుష్క పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ ను వదిలారు. ప్రొఫెషనల్ చెఫ్ 'అన్విత రవళి' పాత్రలో ఆమె ఈ సినిమాలో నటిస్తోంది. కెరియర్ పరంగా ఇది ఆమెకి 48వ సినిమా. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమాకి, త్వరలోనే టైటిల్ ను ఖరారు చేయనున్నారు. మిగతా నటీనటుల వివరాలు కూడా త్వరలోనే తెలియనున్నాయి. 

  • Loading...

More Telugu News