Samantha: పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకెళ్లాలి: సమంత

Samantha latest pic
  • మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత
  • తన లేటెస్ట్ ఫొటోను షేర్ చేసిన సామ్
  • 'యశోద' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటానని వెల్లడి
సినీ నటి సమంత మయోసైటిస్ వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యంతోనే ఆమె తన తాజా చిత్రం 'యశోద'కు డబ్బింగ్ చెప్పారు. తాజాగా ఆమె తన లేటెస్ట్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. జీవితం ఎలా ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, మనం వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలని... మనలో ఉన్న ధైర్యం ఏమిటో నిరూపించుకోవాలని తన స్నేహితులు చెప్పారని... ఆ మాటలను తాను స్ఫూర్తిగా తీసుకుంటున్నానని తెలిపింది. నవంబర్ 11న 'యశోద' చిత్రం విడుదలవుతోందని... ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా తాను పాల్గొంటానని చెప్పింది. సమంత పోస్టును చూసిన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్వీన్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. 
Samantha
Tollywood
Yashoda Movie

More Telugu News