Janhavi Kapoor: అతను నా పక్కన ఉంటే సంతోషంగా ఉంటాను: బాయ్ ఫ్రెండ్ పై జాన్వీ కపూర్ కామెంట్

Janhavi Kapoor response on his love with Orhan
  • ఒర్హాన్ తో జాన్వీ డేటింగ్ చేస్తోందని ప్రచారం
  • అతను తనకు చాలా ఏళ్లుగా తెలుసన్న జాన్వీ
  • ప్రతి విషయంలో తనకు అండగా ఉన్నాడని వ్యాఖ్య
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ కి ఇప్పటి వరకు సూపర్ సక్సెస్ రాకపోయినా... వరుస సినిమాలతో ఆమె ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు ఆమె లవ్ అఫైర్ల గురించి బీటౌన్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక కథనం వస్తూనే ఉంటుంది. ఒర్హాన్ తో ఆమె డేటింగ్ చేస్తోందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒర్హాన్ ఒక వ్యాపారవేత్త కుమారుడు. వీరిద్దరూ కలిసి పార్టీలు, డిన్నర్లు, విదేశీ టూర్లకు వెళ్తున్నారు. చాలా కాలంగా వీరిద్దరికీ స్నేహం ఉంది. 

తన తాజా చిత్రం 'మిలీ' ప్రమోషన్ కార్యక్రమంలో జాన్వీ మాట్లాడుతూ... ఒర్హాన్ చాలా ఏళ్లుగా తనకు తెలుసని చెప్పింది. అతనితో ఉంటే తాను ప్రతి క్షణం సంతోషంగా ఉంటానని తెలిపింది. ప్రతి విషయంలో ఎంతో కాలంగా తనకు అండగా ఉన్నాడని చెప్పింది. ఒర్హాన్ తన పక్కన ఉంటే తమ ఇంట్లోనే ఉన్నాననే భావన కలుగుతుందని తెలిపింది.
Janhavi Kapoor
Orhan
Love
Dating
Bollywood

More Telugu News