Anand Mahindra: భైరవా.. టీ20 ఫైనల్స్ కు ఎవరు వెళాతారో చెప్పవూ?: ఆనంద్ మహీంద్రా సూపర్ వీడియో

Anand Mahindra shares hilarious dog video after Indias win over Zimbabwe in T20 World Cup
  • ఓ శునకంతో కూడిన వీడియో పోస్ట్
  • టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ కు ఎవరు చేరతారని ప్రశ్న
  • శునకాన్ని భవిష్యత్తులోకి తొంగి చూసి చెప్పాలని కోరానంటూ ట్వీట్
సూపర్ -12 దశలో చివరి మ్యాచ్ లో భాగంగా జింబాబ్వేపై భారత్ గొప్ప విజయాన్ని నమోదు చేయడంతో, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యాన్ని, ఉత్సాహాన్ని తీసుకొచ్చే ఓ వీడియోను షేర్ చేశారు. ఇది ఓ కుక్కకు సంబంధించినది. ఓ ఇంటి ప్రహరీకి సమీపంలో ఒక కొబ్బరి చెట్టు ఉంది. ఓ శునకం ఆ కొబ్బరి చెట్టును ఆసరాగా చేసుకుని, చిన్నగా పైకి పాకుతూ వెళుతుంది. చివరికి ఇంటి ప్రహరీ గోడకు సమాంతర ఎత్తుకు చేరుకుని ఆసక్తిగా ఇంటి లోపలి వైపునకు చూస్తుంటుంది. 

మరి అలా ఎందుకు చూస్తుందో అన్నది ఆ శునకానికే తెలియాలి. ‘‘భవిష్యత్తులోకి ఓ సారి తొంగి చూసి, టీ 20 వరల్డ్ కప్, 2022 ఫైనల్స్ లో ఎవరు ఉంటారో (ఏ జట్లు) చూసి చెప్పాలని నేను ఈ కుక్కను అడిగాను. కానీ, ఇది మాత్రం వర్తమానంలోని గోడను ఎక్కి చూసేందుకు ఈ తెలివైన మార్గాన్ని ఎంపిక చేసుకుంది. అది చూసింది ఏంటి అనుకుంటున్నారా?’’ అంటూ ఆనంద్ మహీంద్రా ఓ ట్వీట్ చేశారు. 

నెటిజన్లు తక్కువ తిన్నారా ఏంటి? మహీంద్రా పోస్ట్ కు అదే స్టయిల్ లో సమాధానాలిస్తున్నారు. ‘‘ఇది భవిష్యత్తులోకి తొంగి చూసింది. వచ్చే ఆదివారం భారత జట్టు టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో నిలబడి ఉంటుంది’’ అంటూ ఆశిష్ సింఘాల్ ట్వీట్ చేశారు.
Anand Mahindra
shares
hilarious dog video
T20 World Cup

More Telugu News