Samantha: సమంత వ్యాధి గురించి 'యశోద' నిర్మాత స్పందన

  • డబ్బింగ్ సమయంలోనే సమంతకు మయోసైటిస్ అనే విషయం తెలిసిందన్న శివలెంక ప్రసాద్
  • తమిళంలో డబ్బింగ్ చెప్పే సమయానికి ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయాయని వెల్లడి
  • అనారోగ్యంలో సైతం తమిళ డబ్బింగ్ తానే చెపుతానందని ప్రశంస
Yashoda movie producer response on Samantha Illness

ప్రముఖ సినీ నటి సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురయింది. సామ్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు. మరోవైపు 'యశోద' చిత్రంలో సమంత నటించింది. చేతికి సెలైన్ ఎక్కించుకుంటూ సినిమాకు ఆమె డబ్బింగ్ చెప్పింది. సమంత్ షేర్ చేసిన ఈ ఫొటో వైరల్ అయింది. 

మరోవైపు సమంత వ్యాధిపై ఈ చిత్ర నిర్మాత శివలెంక ప్రసాద్ స్పందించారు. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత డబ్బింగ్ చెప్పే సమయంలోనే సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోందనే విషయం తెలిసిందని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో సమంత పోస్ట్ చేయడానికి నాలుగు రోజుల ముందే తమకు ఆ విషయం గురించి తెలిపిందని చెప్పారు. 

అప్పటికే ఆమె తెలుగులో డబ్బింగ్ చెప్పేశారని, తమిళంలో డబ్బింగ్ చెప్పే సమయానికి ఆమెకు ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయాయని అన్నారు. వేరే వ్యక్తితో తమిళంలో డబ్బింగ్ చెప్పిద్దామని తాను చెప్పానని... అయితే తన వాయిస్ తమిళ ప్రేక్షకులందరికీ తెలుసని... అందువల్ల తానే డబ్బింగ్ చెపుతానందని అన్నారు. దీంతో డాక్టర్ల సమక్షంలో మూడు, నాలుగు రోజుల పాటు సమంత డబ్బింగ్ చెప్పిందని తెలిపారు. సమంత డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెపుతున్నానని అన్నారు.

More Telugu News