అందమైన ప్రేమకథలో అల్లకల్లోలం .. 'బుట్టబొమ్మ' టీజర్ రిలీజ్!

  • అనిఖ సురేంద్రన్ కథానాయికగా 'బుట్టబొమ్మ'
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథ ఇది 
  • విలన్ పాత్రను పోషించిన అర్జున్ దాస్
  • సంగీత దర్శకత్వం వహించిన గోపీసుందర్
Butta Bomma teaser released

అనిఖ సురేంద్రన్ ... తెలుగు - తమిళ ప్రేక్షకులకు ఈ పేరు బాగా తెలుసు. చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసిన అనిఖ, ఇప్పుడు హీరోయిన్ గా అడుగులు వేస్తోంది. టీనేజ్ ప్రేమకథలు ఇప్పుడు ఆమె ఇంటిముందు క్యూ కట్టాయి. అనిఖ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి అనిఖ ప్రధానమైన పాత్రధారిగా 'బుట్టబొమ్మ' సినిమా రూపొందింది. 

సితార నాగవంశీ - త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, శౌరి చంద్రశేఖర్ దర్శకత్వం వహించాడు. సుకుమార్ దగ్గర స్క్రిప్ట్ విభాగంలోను .. డైరెక్షన్ టీమ్ లోను పనిచేసిన ఆయన, 'బుట్టబొమ్మ' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు. ఈ రోజున త్రివిక్రమ్ బర్త్ డే కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. 

అనిఖ - సూర్య వశిష్ఠ నాయిక నాయకులుగా నటించిన ఈ సినిమాలో, విలన్ గా అర్జున్ దాస్ నటించాడు. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ. అందమైన ఆ ప్రేమకథను అల్లకల్లోలం చేసే పాత్రలో అర్జున్ దాస్ కనిపించనున్నాడు. ఈ మూడు పాత్రల చుట్టూనే ప్రధానమైన కథ తిరగనుంది. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News