L Vijayalakshmi: ఎన్టీఆర్ - ఏఎన్నార్ లను చూసే నేర్చుకున్నాను: సీనియర్ నటీమణి ఎల్ విజయలక్ష్మి

  • 1960లలో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఎల్. విజయలక్ష్మి 
  • నటిగా .. నర్తకిగా మంచి ఇమేజ్ 
  • పదేళ్లలో 100 సినిమాల పూర్తి 
  • వివాహం తరువాత సినిమాలకి దూరం 
  • 50 ఏళ్ల తరువాత హైదరాబాద్ వచ్చిన విజయలక్ష్మి 
L Vijayalakshmi Interview

1960వ దశకంలో తెలుగు తెరపై నటిగా .. నర్తకిగా ఎల్. విజయలక్ష్మి ఒక వెలుగు వెలిగారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ ..  హిందీ భాషల్లో కలుపుకుని ఆమె పదేళ్లలో 100కి పైగా సినిమాలు చేశారు. వివాహమైన తరువాత ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. అందుకు కారణం ఆమె విదేశాల్లో స్థిరపడటమే. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఆమెను అమెరికా నుంచి ఆహ్వానించి, ఎన్టీఆర్ శతాబ్ది అవార్డును అందజేసి సత్కరించారు. తాజాగా ఆమె 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ వేదికపై ఎల్. విజయలక్ష్మి మాట్లాడుతూ .. " ఎన్టీఆర్ శతాబ్ది అవార్డును అందుకోవడం .. ఆ మహాపురుషుని బంగారు పతాకాన్ని నేను ధరించడం నా అదృష్టం. ఎన్టీఆర్ తో నేను ఎక్కువ సినిమాలు చేశాను. నేను సినిమాల్లోకి  వచ్చేనాటికే ఎన్టీఆర్ గారు స్టార్. అందువలన ఆయనతో చేయడానికి భయపడ్డాను. కానీ ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ నాలోని భయాన్ని పోగొట్టారు. ఆ తరువాత ఇక వరుస సినిమాలు చేస్తూ వెళ్లాను. నాతో డాన్స్ చేయడానికి అప్పట్లో హీరోలెవరూ ఇబ్బందిపడలేదు. నేను ఆల్రెడీ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను గనుక, నేను పెద్దగా ఇబ్బంది పడకుండా చేసేదానిని అంతే. 

పెళ్లికి ముందు నేను పెద్దగా చదువుకోలేదు. ఒక వైపున నాట్య ప్రదర్శనలు .. మరో వైపున సినిమాలతో బిజీగా ఉండేదానిని. అందువలన పదో తరగతి లోపే నేను చదువు ఆపేయవలసి వచ్చింది. పెళ్లి తరువాత నేను విదేశాలకి వెళ్లాను. సినిమాలు చేసే అవకాశం లేకపోవడం వలన, చదువుకోవాలని అనుకున్నాను. ఎన్టీఆర్ - ఏఎన్నార్ తో కలిసి పనిచేయడం వలన, వాళ్ల అంకితభావం . కష్టపడేతత్వం ఎలా ఉంటుందనేది చూశాను. ఆ అంకితభావాన్ని నేను చదువుపై ఎందుకు పెట్టకూడదని అనుకున్నాను. అలా చదువుకోవడం మొదలుపెట్టాను. ఎన్నో డిగ్రీలు పూర్తి చేశాను .. ఉద్యోగాలు చేశాను" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News