Janasena: పవన్ మా గ్రామానికి ఇస్తానన్న రూ.50 లక్షలు ఇవ్వలేదు: ఇప్పటం గ్రామస్థుడు

Ippatam villager slleges that pawan kalyan not yet given 50 lack rupees to his village
  • మార్చిలో ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ
  • సభకు భూములు ఇచ్చినందుకు ఇప్పటం గ్రామానికి రూ.50 లక్షల సాయం ప్రకటించిన పవన్
  • సభ జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పవన్ ప్రకటించిన సాయం అందలేదంటున్న గ్రామస్థుడు
  • గ్రామస్థుడి వ్యాఖ్యలతో కూడిన వీడియోను పోస్ట్ చేసిన వైసీపీ

గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనసాగుతున్నారు. తన పార్టీ సభకు భూములు ఇచ్చారన్న దుగ్ధతో అదికార వైసీపీ ఇప్పటం గ్రామంలో ఇళ్లను కూలగొట్టిందంటూ ఆరోపణలు గుప్పించిన పవన్ కల్యాణ్... కూలిపోయిన ఇళ్లను పరిశీలించే నిమిత్తం శనివారం ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ పర్యటన, పవన్ తమ గ్రామానికి ఇచ్చిన హామీ తదితరాలను ప్రస్తావిస్తూ ఇప్పటం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సదరు వ్యక్తి మాటలతో కూడిన ఓ వీడియోను అధికార వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.

జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించుకునేందుకు ఇప్పటం గ్రామస్థులు తమ భూములు ఇవ్వడంతో ఆ గ్రామానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జనసేన సభ మార్చిలో జరిగితే... ఇప్పటిదాకా ఇప్పటం గ్రామానికి పవన్ ప్రకటించిన రూ.50 లక్షలు అందనే లేదట. 

ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఇప్పటం గ్రామస్థుడు పవన్ కల్యాణ్ కు దమ్ము, ధైర్యం ఉంటే తమ గ్రామానికి ఇస్తానన్న రూ.50 లక్షలు ఇచ్చి గ్రామంలో అడుగుపెట్టాలని వ్యాఖ్యానించారు. జనసేన సభ జరిగి 11 నెలలు అవుతున్నా పవన్ ప్రకటించిన నిధులు ఇప్పటిదాకా తమ గ్రామానికి అందనే లేదని ఆయన పేర్కొన్నారు. తమ గ్రామంలో ఇప్పటిదాకా ఎలాంటి రాజకీయ గొడవలు లేవని, 'దూకుడు' సినిమాలో బ్రహ్మానందం మాదిరి కమెడియన్లు ఓ ముగ్గురు వచ్చి ఇప్పుడు రాజకీయ కక్షలను పెంచుతున్నారంటూ ఆయన వాపోయారు.

  • Loading...

More Telugu News