Twitter: మస్క్ చేతికి.. అబద్ధాలను వ్యాప్తి చేసే వేదిక..: జో బైడెన్ విమర్శలు

  • ట్విట్టర్ పై అమెరికా అధ్యక్షుడి విమర్శలు
  • ఇక ఎడిటర్లు ఎంత మాత్రం ఉండరంటూ వ్యాఖ్య
  • పిల్లలు ఎలా అర్థం చేసుకోగలరంటూ ప్రశ్న
Sends and spews lies Joe Biden slams Elon Musks acquisition of Twitter

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్విట్టర్ పై తాజా విమర్శలకు దిగారు. దాన్నొక అబద్ధాల పుట్టగా అభివర్ణించారు. ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొన్ని రోజుల క్రితమే 44 బిలియన్ డాలర్లు వెచ్చించి (రూ. 3.6 లక్షల కోట్లు) ట్విట్టర్ లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేయడం తెలిసిందే. అప్పటి నుంచి మస్క్ వరుసగా సంచలన నిర్ణయాలతో ట్విట్టర్ ను నిత్యం వార్తల్లో ఉంచుతున్నారు. దీని ద్వారా మస్క్ ట్విట్టర్ కు మరింత ప్రచారాన్ని కల్పించుకుంటున్నారనే విమర్శ ఉంది.

తాజాగా శుక్రవారం షికాగోలో ఓ నిధుల సమీకరణ కార్యక్రమం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు మనమంతా ఆందోళన చెందాల్సినది ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా అబద్ధాలను వ్యాప్తి చేసే, అబద్ధాలను చిమ్మే వేదికను (ట్విట్టర్) ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాడు. ఇంక అక్కడ ఎడిటర్లు ఎంత మాత్రం ఉండరు. ప్రమాదకరమైన వాటిని పిల్లలు అర్థం చేసుకోగలరని మనం ఎలా ఆశిస్తాం?’’ అంటూ వ్యాఖ్యానించారు. ట్విట్టర్ కొనుగోలు చేసిన 10 రోజుల్లోనే సగం మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసిన మస్క్.. బ్లూటిక్ యూజర్లకు నెలవారీ ఫీజును భారీగా పెంచేయడం తెలిసిందే.

More Telugu News