Sudigali Sudheer: ఎక్కడికి వెళ్లినా అందరూ రష్మి గురించే అడుగుతుంటారు: సుడిగాలి సుధీర్

Sudigali Sudheer Interview
  • బుల్లితెరపై సుధీర్ కి మంచి క్రేజ్ 
  • హీరోగాను వస్తున్న అవకాశాలు 
  • 'జబర్దస్త్' వదల్లేదన్న సుధీర్ 
  • ఆ షోకి దూరం కావడానికి కారణమదేనంటూ వెల్లడి   
సుడిగాలి సుధీర్ కి బుల్లితెరపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్ వల్లనే ఆయన సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. తెలుగు తెరపై హీరోగా నిలదొక్కుకోవటానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'గాలోడు' రెడీ అవుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆయన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. 

'జబర్దస్త్' చేసే వరకూ నేను ఎవరికీ తెలియదు. ఆ షో వల్లనే నాకు ఇంతటి గుర్తింపు వచ్చింది. అందరూ అనుకుంటున్నట్టు నేను 'జబర్దస్త్'ను వదిలేసి వెళ్లిపోలేదు. నాకున్న ఆర్ధికపరమైన సర్దుబాటు కారణంగా ఒక 6 నెలల సమయం కావాలని మల్లెమాల వారి అనుమతి తీసుకునే బయటికి వెళ్లాను. ఆర్ధిక పరమైన ఆ సెటిల్ మెంట్ పూర్తయిన తరువాత, ఇక మళ్లీ జబర్దస్త్ చేయడానికి నేను రెడీ అనే విషయం కూడా వాళ్లకి చెప్పాను" అన్నాడు. 

""ఇక నేను ఎక్కడికి వెళ్లినా అందరూ రష్మి గురించే అడుగుతారు. 'మీ ఇద్దరి గురించి మేము విన్నది నిజమేనా?' అంటూ ప్రశ్నిస్తారు. అదంతా స్క్రీన్ వరకే .. మా మధ్య అలాంటిదేమీ లేదు అని నేను చెప్పినా వినిపించుకోరు. చాలా కాలంగా ఇద్దరం కలిసి పనిచేస్తూ ఉండటం కూడా ఇందుకు కారణం కావొచ్చు. ఒక ఆర్టిస్టు గా అందరినీ ఎంటర్టయిన్ చేయడమే నా లక్ష్యం .. అందుకు ఎంత కష్టమైనా పడతాను" అంటూ చెప్పుకొచ్చాడు.

Sudigali Sudheer
Rashmi
Jabardasth

More Telugu News