CM Jagan: అన్నవరం మహిళ ఆరుద్ర సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన సీఎం జగన్

CM Jagan orders officials to look into Ardura matter
  • సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించిన మహిళ
  • స్పందించిన సీఎం జగన్
  • ఆరుద్రను అంబులెన్స్ లో తీసుకువచ్చిన అధికారులు
  • ఆమెతో మాట్లాడిన సీఎం ముఖ్య కార్యదర్శి
కాకినాడ జిల్లా అన్నవరంకు చెందిన రాజులపూడి ఆరుద్ర అనే మహిళ తన క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేయడంపై సీఎం జగన్ స్పందించారు. ఆమె సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. అధికారులు ఆమెకు అండగా నిలవాలని స్పష్టం చేశారు. 

సీఎం ఆదేశాలతో కదిలిన అధికారులు ఆరుద్రను ప్రత్యేక అంబులెన్సులో తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్దకు తీసుకువచ్చారు. సీఎం ముఖ్యకార్యదర్శి ధనంజయరెడ్డి ఈ సందర్భంగా ఆరుద్రతో మాట్లాడి ఆమె సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆరుద్ర హర్షం వ్యక్తం చేశారు. తన సమస్యల పట్ల స్పందించడమే కాకుండా హామీ ఇచ్చిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. 

తన కుమార్తె చికిత్సకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారని, తన ఇంటిని అమ్ముకునేందుకు అడ్డుపడుతున్న పోలీసు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకుంటామని కూడా భరోసా ఇచ్చారని ఆరుద్ర వెల్లడించారు.
CM Jagan
Arudra
Annavaram
YSRCP
Andhra Pradesh

More Telugu News