Australia: ఆస్ట్రేలియాను 168 పరుగులకు కట్టడి చేసిన ఆఫ్ఘనిస్థాన్

  • అడిలైడ్ ఓవల్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్
  • మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్
  • 32 బంతుల్లో 54 పరుగులు చేసిన మ్యాక్స్ వెల్ 
Australia posts 168 runs against Afghanistan

ఆఫ్ఘనిస్థాన్ తో జరుగుతున్న గ్రూప్-1 లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. నెట్ రన్ రేట్ కోసం ఆసీస్ భారీ స్కోరు సాధించాలని భావించినా, ఆఫ్ఘన్ బౌలర్లు పుంజుకోవడంతో ఆ జట్టు ఆశలు నెరవేరలేదు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా, ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. ఆసీస్ జట్టులో గ్లెన్ మ్యాక్స్ వెల్ 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. మ్యాక్స్ వెల్ 32 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. మిచెల్ మార్ష్ 45, వార్నర్ 25, స్టొయినిస్ 25 పరుగులు చేశారు. 

ఫించ్ గైర్హాజరీలో తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మాథ్యూ వేడ్ 6 పరుగులు చేసి అవుటయ్యాడు. ఓపెనర్ గా వచ్చిన కామెరాన్ గ్రీన్ (3), మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (4) విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో నవీనుల్ హక్ 3, ఫజల్ హక్ ఫరూకీ 2, ముజీబ్ ఉర్ రెహమాన్ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.

More Telugu News