Andhra Pradesh: రేపు తూర్పు గోదావరి జిల్లాకు సీఎం...ఇథనాల్ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్న జగన్

ap cm ya jagan will laid foundation to ethanol industry in east godavari district tomorrow
  • హెలికాప్టర్ ద్వారా గోపవరం చేరనున్న జగన్
  • ఇథనాల్ పరిశ్రమ శంకుస్థాపన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగం
  • తిరిగి మధ్యాహ్నం 1.10 గంటలకు తాడేపల్లి చేరనున్న ఏపీ సీఎం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (శుక్రవారం) తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని గోపవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న ఇథనాల్ పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సమీపంలోని హెలిప్యాడ్ చేరనున్న జగన్... హెలికాప్టర్ ద్వారా గోపవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గుమ్మళ్లదొడ్డి గ్రామంకు వెళతారు. గ్రామంలో ఇథనాల్ పరిశ్రమకు శంకుస్థాపన చేసి తిరిగి అదే హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1.10 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం చేరుకుంటారు.
Andhra Pradesh
YSRCP
YS Jagan
East Godavari District
Ethanol Industry

More Telugu News