Ramcharan: టాంజానియాలో సేదదీరుతున్న చరణ్ - ఉపాసన!

Charan and Upasana on Vecation
  • చరణ్ 15వ సినిమా దర్శకుడిగా శంకర్ 
  • తదుపరి షెడ్యూల్ కోసం లభించిన గ్యాప్ 
  • ఉపాసనతో విదేశాలకి వెళ్లిన చరణ్
  • కొత్త ఉత్సాహంతో విహరిస్తున్న జంట  

చరణ్ - ఉపాసన ఇద్దరూ కూడా ఏ మాత్రం కాస్త సమయం చిక్కినా విదేశాలకి వెళ్లి అక్కడ సరదాగా గడిపేసి వస్తుంటారు. అలా వాళ్లిద్దరూ ప్రస్తుతం 'టాంజానియా'లో షికారు చేస్తున్నారు. అక్కడ తమకి నచ్చిన ఒక లొకేషన్లో సేదదీరుతూ ఫోటోలు దిగారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

'ఆర్ ఆర్ ఆర్' సినిమా నుంచి చరణ్ వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు.  'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం ఆయన ఎక్కువ కాలం పనిచేశాడు. ఆ సినిమా చివరిలో 'ఆచార్య' షూటింగులో పాల్గొన్నారు. ఆ వెంటనే శంకర్ తో భారీ సినిమా చేస్తూ వెళుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ కి శంకర్ కొంచెం ఎక్కువ గ్యాప్ ఇవ్వడంతో, చరణ్ కాస్త రిలాక్స్ కావడం కోసం ఉపాసనతో ఇలా విదేశాల్లో విహరిస్తున్నాడు. 

ఇక ఉపాసనకి కూడా బాధ్యతలు ఎక్కువే. ఒక వైపున చరణ్ కి సంబంధించిన విషయాలను .. మరో వైపున అపోలో హాస్పిటల్స్ కి సంబంధించి తనకి అప్పగించిన పనులతో ఆమె సతమతమవుతూ ఉంటుంది. అందువల్లనే ఇద్దరూ కలిసి 'టాంజానియా' ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. అక్కడి ఆహ్లాదకరమైన లొకేషన్లో ఇలా సేదదీరుతూ కొత్త ఉత్సాహాన్ని పొందుతున్నారు.

  • Loading...

More Telugu News