Andhra Pradesh: అవుకులో వైఎస్ జగన్...చల్లా భగీరథరెడ్డికి నివాళి అర్పించిన ఏపీ సీఎం

ap cm ys jagan paid tributes to challa bhageeratha reddy
  • అనారోగ్యంతో మృతి చెందిన చల్లా భగీరథ రెడ్డి
  • భగీరథ రెడ్డి భౌతిక కాయానికి నివాళి అర్పించేందుకు అవుకు వెళ్లిన జగన్
  • చల్లా కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం నంద్యాల జిల్లా కోవెలకుంట్ల నియోజకవర్గ పరిధిలోని అవుకుకు వెళ్లారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి (46) అనారోగ్య కారణాలతో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడిగా చిరపరచితులైన భగీరథ రెడ్డి...తండ్రి మరణంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకున్నారు. 

కొన్నిరోజులపాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడిన భగీరథ రెడ్డి హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం కన్నుమూశారు. నేటి సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ క్రమంలో భగీరథ రెడ్డి భౌతిక కాయానికి నివాళి అర్పించేందుకే జగన్ అవుకు వెళ్లారు. కాసేపటి క్రితం అవుకు చేరుకున్న జగన్... భగీరథ రెడ్డి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. భగీరథ రెడ్డి కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు.
Andhra Pradesh
YSRCP
YS Jagan
Nandyal District
Owk
Challa Bhageeratha Reddy

More Telugu News