Andhra Pradesh: ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు

senior journalist kommineni srinivasa rao apppointed as ap press academy chairman
  • గురువారం రెండు కీలక పదవులను భర్తీ చేసిన ఏపీ ప్రభుత్వం
  • కేబినెట్ హోదాలో కొమ్మినేనికి పదవి
  • రెండేళ్ల పాటు ప్రెస్ అకాడెమీ చైర్మన్ గా కొనసాగనున్న సీనియర్ జర్నలిస్టు
నామినేటెడ్ పదవుల భర్తీలో ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. గురువారం మధ్యాహ్నం ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని నియమించిన గంటల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పదవిని భర్తీ చేసింది. ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును నియమించింది. 

కేబినెట్ హోదాలో కొమ్మినేనిని ప్రెస్ అకాడెమీ చైర్మన్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో కొమ్మినేని రెందడేళ్ల పాట్లు కొనసాగనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో తెలిపింది. సీఎం జగన్ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి టీవీలో కొమ్మినేని పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
Andhra Pradesh
YSRCP
YS Jagan
Kommineni Srinivasa Rao
AP Press Academy
Sakshi TV

More Telugu News